తెలంగాణలోని దేవరకొండలో డీఎస్పీకు చెందిన పోలీసు వాహనం రోడ్డుపై వెళ్తోన్న బైకర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగస్టు 17, గురువారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డయింది. బాధితుడిని డిక్కీలో వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ROAD #ACCIDENT CAUGHT ON CAMERA : #DSP Devarakonda Nageswar Rao #vehicle rams into biker at bodangiparthy ,Chandur mandal #Telangana's Nalgonda.
The man suffered injuries.
Please use #helmet before riding your bike.#Telangana #Accident pic.twitter.com/GeMqtJggri— Arbaaz The Great (@ArbaazTheGreat1) August 19, 2022
నల్గొండ పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం నిన్న సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో దేవరకొండ డీఎస్పీ అధికారిక వాహనం ఓ బైకర్‌ను ఢీకొట్టింది. డీఎస్పీ తన వాహనంలో బైకర్ ను ఆసుపత్రికి తరలించారు, అక్కడ బైకర్ కాలు ఫ్రాక్చర్ అయ్యిందని.. ప్రమాదం ఏం లేదని వైద్యులు అతనికి చెప్పారని ఎస్పీ తెలిపారు. అనంతరం వాహన డ్రైవర్ ను సస్పెండ్ చేశారు. డీఎస్పీపై తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఎస్పీ వివరించారు.
https://twitter.com/KP_Aashish/status/1560488010155601923?s=20&t=QwTA7-ojLETKabJ5YPSaXQ