చైనా ధోరణి మారడం లేదు. సరిహద్దులో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మొన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ… తాజాగా గాల్వాన్ లోయనుంచి అంటూ సైనికులు న్యూఇయర్ విషెస్ పంపిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోపై వెంటనే స్పందించిన ఇండియన్ ఆర్మీ… చైనా జెండా ఎగురవేసిన భూభాగం మనది కాదని స్పష్టం చేసింది.
🇨🇳China’s national flag rise over Galwan Valley on the New Year Day of 2022.
This national flag is very special since it once flew over Tiananmen Square in Beijing. pic.twitter.com/fBzN0I4mCi
— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) January 1, 2022
గాల్వాన్ లోయ నుంచి చైనా ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ…సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని సందేశం పంపింది. అయితే చైనా జెండా ఎగురవేసినట్టు కనిపిస్తున్న ప్రదేశం 2020జూన్ లో భారత్-చైనా ఆర్మీ ఘర్షణపడిన లోయ దగ్గర కాదని…చైనా ఆధీనంలోని వివాదరహిత ప్రాంతంలోనిదేననీ పేర్కొంది.
అటు గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ ఎగురవేసిన చైనా జాతీయ జెండా గతంలో తియన్మార్ స్క్వేర్ పై ఎగురవేసినంత ప్రత్యేకమైనదని గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. క్రితంసారి గాల్వాన్ లోయ ఘర్షణల తరువాత 2021 జులైలో ఇరుదేశాల ఆర్మీ పరస్పర అంగీకారంతోనే వివాదాస్పద ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాలని నిర్ణయించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి.
గతేడాది జులైలో వచ్చిన ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా కూడా… చైనా సైన్యం 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లినట్టు నిర్థారణ అయింది. నాటి ఘర్షణలో 20మంది భారత సైనికులు చనిపోయారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారాలతో నివాళులు అర్పించింది. నాటి పోరులో తమ సైనికులు నలుగురే చనిపోయారని చైనా పేర్కొన్నా..భారత్ కన్నా చైనాకే ఎక్కువ నష్టం వాటిల్లిందని 40మంది సైనికులు చనిపోయారనీ భారతసైన్యం ధ్రువీకరించింది.
పొరుగుదేశం సరిహద్దులో ఇలా లేనిపోనివి ప్రచారం చేస్తుంటే మన దేశంలోని సెక్యులర్ నాయకులు మరింత ఆజ్యం పోస్తున్నారు. తమ భూభాగంలోనే చైనా జెండా ఎగురవేస్తే…ప్రధానిగారూ అక్కడ భారతజెండా ఉంటే బాగుంటుంది. ఇకనైనా మీరు మౌనం వీడండి అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. అయితే రాహుల్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ట్వీట్ చేయడమేంటని మండిపడుతున్నారు.
गलवान पर हमारा तिरंगा ही अच्छा लगता है।
चीन को जवाब देना होगा।
मोदी जी, चुप्पी तोड़ो!— Rahul Gandhi (@RahulGandhi) January 2, 2022