డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్‌ను భారత ప్రభుత్వం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా నియమించింది. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి అయిన నాగేశ్వరన్ రచయితకూడా. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.
డాక్టర్ నాగేశ్వరన్ IFMR గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు డీన్‌గా, క్రియా యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనమిక్స్ గా పనిచేశారు. అతను 2019 నుండి 2021 వరకు భారత ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైమ్ సభ్యునిగా ఉన్నారు. భారత్ లోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బోధించారు.
ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాసెస్ – కన్సీక్వెన్సెస్ అండ్ క్యూర్స్, ది ఎకనామిక్స్ ఆఫ్ డెరివేటివ్స్ మరియు డెరివేటివ్స్ వంటి అనేక పుస్తకాలను రాశారు నాగేశ్వరన్.
తక్షశిల ఇన్స్టిట్యూషన్ ను ఏర్పాటులో డాక్టర్ నాగేశ్వరన్ కీలక పాత్ర. 2001లో ఆవిష్కార్ గ్రూప్ ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ప్రారంభించడంలోనూ ఆయన తోడ్పాటు ఉంది.