మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు అస్సలే ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు సీవీఎల్ నర్సింహారావు. ప్రకాశ్ రాజ్ కు దేశం మీద గౌరవం లేదని..రాముడంటే భక్తి లేదని… రాముడ్ని సేవించే కోట్లాదిమంది మనోభావాలు ఆయనకు పట్టవని గుర్తుచేశారు. మా అధ్యక్షపదవిని రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. మా అధ్యక్షపదవికి ఆయనేమాత్రం తగిన వ్యక్తి కాదన్నారు. తెలంగాణ ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతోందని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానంటూ…అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్టు గతంలో ప్రకటించారు సీవీఎల్ . నామినేషన్ కూడా వేసి తరువాత ఉపసంహరించుకున్నారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ ప్యానెల్ అయినా పోటీలో ఉన్న తెలంగాణ ఆర్టిస్టులను గెలిపించాలని కోరారు.

ప్రకాశ్ రాజ్ కు ఓటేయవద్దు – తెలంగాణ ఆర్టిస్టులను గెలిపించుకుందాం : సీవీఎల్

Share: