కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకుంటున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు శశిథరూర్. హైకమాండ్ ఆదేశంతో తాను తప్పుకుంటున్నానన్న ప్రచారం వట్టిదేనన్నారు. ఆ పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 17 పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీలో ఉన్నారు. అయితే తాను పోటీలో ఉండబోవడం లేదన్న వార్తలపై స్పందిస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు థరూర్. తాను పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని… జీవితంలో ఎప్పుడూ అలా వెనక్కి తగ్గలేదని..ఇకముందూ తగ్గబోనని అన్నారు. ఇది స్నేహపూర్వక పోటీయేనని..అయితే చివరివరకూ పోరాటం సాగుతుందని అన్నారు. 17 వతేదీన తనకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు వీడియోలో థరూర్.
https://twitter.com/ShashiTharoor/status/1578637497600331776?s=20&t=2ooAHubN-jKeRr1DU278Gw