ఈ దేశంలో కొందరి నిర్వచనం ప్రకారం వాక్ స్వాతంత్రం అంటే మోడీ ని విమర్శించడమే. మోడీ బాగా పాలిస్తున్నాడు అనో లేదా అవినీతి తగ్గించాడు అనో లేదా దేశ భద్రత బాగా చూస్తున్నాడు లేదా మిగతా దేశాలతో పోలిస్తే కరోనా బాగా కట్టడి చేసాడు అని కానీ పొరపాటున ఏ సెలెబ్రెటీ అయినా బాహాటంగా చెప్పారు అంటే ఈ సెక్యూలర్ ముఠా వారి మీద విరుచుకు పడిపోతుంది.
గతంలో పి.వి సింధు, సైనా నెహ్వాల్ ఇంకా చాలా మంది సందర్భానుసారంగా మోడీ చర్యలు మెచ్చుకున్నారు. అంతే వారి పైన ఈ సెక్యూలర్ ముఠా ఏక బిగిన దాడి చేసింది.
ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో దేశం గర్వించదగ్గ సంగీత సామ్రాట్ మాస్టర్ ఇళయరాజా చేరారు.
ఈయన చేసిన పాపం ఏమిటంటే ‘బ్లూ గ్రాఫ్ డిజిటల్’ అనే సంస్థ “అంబేద్కర్ అండ్ మోడీ – రెఫార్మర్స్ ఐడియాస్, పెరఫార్మర్స్ ఇంప్లీమెంటేషన్” అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ మోడీని పొగిడారు.
ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే ఇది డాక్టర్ అంబేద్కర్ దార్శనికతను వెలుగులోకి తీసుకురావడానికి మరియు అన్ని రంగాల్లో ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోని నవ భారతదేశం అంబేద్కర్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకువెళుతోంది అనే అకడమిక్ ప్రయత్నం అని చెప్పవచ్చు.
ఇళయరాజా ఈ పుస్తకం కోసం తన ముందుమాటలో డాక్టర్ అంబేద్కర్‌ను “తన కాలంలోనే చరిత్ర సృష్టించిన అరుదైన నాయకుడి మాత్రమే కాదు అతను పోయి దశాబ్దాల కాలం గడిచిన తర్వాత కూడా అతను విస్తృతంగా చదవబడుతున్నారు మరియు అనుసరించబడుతున్నారు” అని పేర్కొన్నారు.
2016లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఇళయరాజా ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్‌ను భారతదేశ జల విధాన రూపశిల్పి అని పిలిచిన సంఘటనను ఇళయరాజా ఈ సందర్భంగా ఉటంకించారు.
ప్రధానమంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ లో రోడ్లు, రైల్వేలు, మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు మార్గం సుగమం చేసిందని ఇళయరాజా తన ముందుమాటలో ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు.
సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓబీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అనేక చట్టాల ద్వారా సామాజికంగా అట్టడుగున ఉన్న ప్రజల చట్టపరమైన రక్షణను ప్రధాని మోదీ పటిష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. మరుగుదొడ్లు నిర్మించడం, ఇళ్లు నిర్మించడం, బ్యాంకు ఖాతాలు తెరిపించడం ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మోదీ పెద్ద ఎత్తున కృషి చేశారని, వీటిలో లబ్ధిదారులు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారని ఆయన అన్నారు.
ఇళయరాజా మాట్లాడుతూ, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యుత్తు మరియు ఆర్థిక భాగస్వామ్యంలో సాధించిన విజయాలు, మహిళల వివాహ వయస్సు పెంపుదల, ఆడపిల్లలు రక్షణ మరియు మహిళా అనుకూల ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి అంశాలలో సాధించిన విజయాల ద్వారా వచ్చిన సామాజిక మార్పులను చూసి అంబేద్కర్ గర్వపడేవారని అన్నారు.
అంబేద్కర్ మరియు నరేంద్ర మోడీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సారూప్యతలను ఈ పుస్తకంలో ఆవిష్కరించినందుకు ఇళయరాజా ప్రశంసించారు. ఈ ఇద్దరు వ్యక్తులు భారతదేశం కోసం పెద్ద కలలు కనే వారని, ఇద్దరూ కేవలం ఎక్కువ ఆలోచించడం కంటే ఎక్కువ పని చేయాలని నమ్మే వాస్తవికవాదులని ఆయన అన్నారు.
పలు పార్టీల నేతలు, నెటిజన్లు ఇళయరాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇళయరాజావి పరువు తక్కువ మాటలని తిట్టిపోశారు. వర్ణవ్యవస్థలో అణిచివేతకుగురైన దళితల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ పనిచేస్తే.. మోదీ మనుధర్మ వ్యవస్థకు చెందినవారని.. ఇద్దరిని పోల్చడానికి వీలులేదని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఎలంగొవాన్ విమర్శించారు.
అంబేద్కర్ ని మోడీని పోల్చినందుకు ఇళయరాజా క్షమాపణలు చెప్పాలి అని పలువురు డిమాండ్ చేయగా “అంటే నేను రాసింది తప్పు అని నేనే చెప్పుకోవాలా? మిగతా వాళ్ళు వాళ్ల అభిప్రాయాలను ఎలా వ్యక్త పరుస్తున్నారో నేను కూడా అలాగే చేసాను. అందుచేత క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అని ఇళయరాజా చెప్పారు.
~చాడా శాస్త్రి


(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)