ఆదిలాబాద్ పట్టణం గణేశ్ నగర్ లోని భగత్ సింగ్ చౌక్ నుంచి తొలగించిన భగత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Love Adilabad కు, పట్టణ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అదే సమయంలో సుందరీకరణ పేరుతో ఎన్నో ఏళ్లుగా భగత్ సింగ్ చౌక్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ఉన్న విగ్రహం తొలగింపు సరికాదన్నారు. వెంటనే భగత్ సింగ్ చౌక్ లో ఆ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.