కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ‘కాళీ’ సినిమా పోస్టర్ని లీనా మణిమేకలై సోషల్ మీడియాలో షేర్ చేయడంతో. ఈ వివాదం చెలరేగింది. పోస్టర్లో కాళీ మాత వేషధారణలో ఉన్న మహిళను చిత్రీకరించారు. ఆమె ఫోటోలో సిగరెట్ తాగుతూ కనిపించింది. త్రిశూలంవంటివి ధరించి ఉంది ఆమె అందులో.దాంతోపాటు దేవత పాత్ర పోషిస్తున్న నటుడు LGBTQ+ కమ్యూనిటీ జెండాను పట్టుకున్నట్టు ఉంది. దేవుళ్లను అవమానిస్తూ ఇదేం పైత్యమని హిందువులు, హిందూసంస్థలు మండిపడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ విపరీత ధోరణి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చిత్ర నిర్మాతను అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/LeenaManimekali/status/1543200394477805568?s=20&t=WzM80IrTqRU1jhqn1-xdFw
ఈ వివాదంపై ఫిల్మ్ మేకర్ స్పందిస్తూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది..
ఇది చూశాక “arrest Leena manimekalai” అని కాక “love you Leena manimekalai” అని ట్రెండ్ చేయాలని ఫిల్మ్ మేకర్ లీనా మరింత రెచ్చగొట్టేలా ట్వీట్ చేసింది.
https://twitter.com/LeenaManimekali/status/1543802972324433920?s=20&t=WzM80IrTqRU1jhqn1-xdFw