గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేని క్లిష్టమైన పరిస్థితిలో వారున్నారని డాక్టర్ తెలిపారు. మరో 24 గంటల తరువాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆయన్ని అర్థరాత్రి ఆస్పత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు.కృష్ణ ఆరోగ్యం పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు ఆందోళనగా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కృష్ణ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట విజయనిర్మల ఆయనకు దూరమయ్యారు. తరువాత పెద్ద కుమారుడు రమేశ్ బాబు చనిపోగా… ఇటీవలే ఆయన సతీమణి ఇందిరాదేవి కన్నుమూశారు.
https://twitter.com/SSMBSpace/status/1592071844257202176?s=20&t=5NvaAqIntpeDjAJlVsQeQg