పెళ్లిళ్లు, శుభకార్యాలు, ర్యాలీలు, ఎన్నికలు, క్రికెట్ గెలుపు, న్యూ ఇయర్… ఏ సందర్భంలో అయనా టపాకాయలు కాల్చడం ఆనవాయితీగా మారింది.. అప్పుడెవరూ అభ్యంతరం చెప్పరు..
కానీ దీపావళి పండుగ వచ్చేసరికి కాలుష్యం గుర్తుకు వస్తుంది. ఎక్కువ ధ్వని, కాలుష్యానికి కారణమయ్యే పటాసులు కాల్చొచ్చు అని సూచిస్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ అసలు క్రాకర్సే కాల్చొద్దంటారు క్రాక్ గాళ్లు.. ఆంక్షలు పెట్టడం, కోర్టులు జోక్యం చేసుకోవడం అతిగా మారింది..

ఒక్క దీపావళి పండుగ మాత్రమే కాదు.. వినాయక చవితి నిమజ్జనం, సంక్రాంతి గాలి పటాలు, చివరకు హోలీ రంగులపై కూడా లొల్లే.. చేప మందుపై కూడా రాద్దాంతమే.. రావణ దహనం వద్దంటారు.. విజయదశమి, శ్రీరామ నవమి ఉత్సవాలతో అనవసర ఖర్చు అని వాదించే వెధవాయిలకు తక్కువేమీ లేదు.. చివరకు ఎవరిళ్లలో వాళ్లే పండుగ జరుపుకుకోవాలి, సౌండ్ బయటకు రాకుండా తలుపులు, ఇటికీలు మూసుకోండి అనే రోజులు కూడా వస్తాయి..
మనకు ఎందుకనుకునే అనే మొద్దు చర్మం హిందూ, బొందుగాళ్లు ఉన్నంత కాలం కుట్రదారుల ఆటలు ఇలాగే సాగుతుంటాయి.. ఇకనైనా చైతన్యం రాకపోతే భావి తరాలు భావితరాలు మూల్యం చెల్లించుకోక తప్పదు.. మున్ముందు సంవత్సరానికి రెండో మూడో పండుగలు చాలంటారు చూస్తూ ఉండండి..