రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాజకీయ కార్యకలాపాలు జోరుగా ఉన్నాయి. అదే సమయంలో అక్రమాలు జరగకుండా ఎన్నికల సంఘం కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మద్యం, నగదు పంపిణీని అడ్డుకుంటూ రాష్ట్రమంతా జల్లెడ పడుతోంది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి కీలకంగా వ్యవహరిస్తున్నది త్రిబుల్ సి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం డేగ కన్ను అని అనుకోవచ్చు . దీని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ చాలా పటిష్టమైనది సార్వత్రిక ఎన్నికలు క్రమం తప్పకుండా, అద్భుతంగా నిర్వహించడం ఎన్నికల సంఘం గొప్పతనం. ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంట్రిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (త్రిబుల్ “సి”) ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ త్రిబుల్ సి పనిచేస్తుంది.
ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం దీని ద్వారా
24/7 రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో అత్యాధునిక సాంకేతికత అనుసంధానంతో దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కీలక ప్రాంతాలు, ముఖ్య కార్యాలయాలు, చెక్ పోస్ట్ ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎన్నికల కార్యాలయంలోని త్రిబుల్ సీ కి అనుసంధానం చేశారు. దీంతో 26 జిల్లాల్లో ఎప్పుడు, ఎక్కడ, ఏమి జరుగుతుంది అనేది క్షణాల్లో తెలిసిపోతుంది.
కోడ్ ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా , సీజర్లపై పటిష్టమైన పర్యవేక్షణ, నియంత్ర్రణ చేయడం జరుగుచున్నది. అంతర్-రాష్ట్ర్ర సరిహద్దులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నమొత్తం 424 చెక్ పోస్టుల్లో దాదాపు 358 చెక్ పోస్టుల (84.4%) నుండి వెళ్లే వాహనాల కదలికలను వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ కేంద్రం నుండే పర్యవేక్షించడం జరుగుచున్నది.
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో రూ. 141 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగింది. 2019 ఎన్నికల నిర్వహణ సందర్బంగా జప్తు చేయబడిన అక్రమ ఆస్తుల విలువ కంటే ఇది దాదాపు రెండు రెట్లు అదికం. ఎన్నికల నిర్వహణకు ముందే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకోవడం అనేది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు.
ఎన్నికల సందర్బంగా ఓటర్లపై మద్యం ప్రభావం ఏమాత్రము ఉండకూడదు అనే లక్ష్యంతో మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని మద్యం తయారీ సంస్థల గోడౌన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో వెబ్ కెమేరాల ఉన్నాయి . మద్యం తయారీ సంస్థల నుండి గోదాములకు, షాపులకు, బార్లకు లేదా ఇతర సంస్థలకు మద్యం సరఫరా చేస్తున్న వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ కేంద్రం నుండి పర్యవేక్షించడం జరుగుచున్నది. దీంతో విచ్చలవిడిగా మద్యం సరఫరా చేయకుండా అడ్డుకునేందుకు వీలవుతుంది.
క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలనే లక్ష్యంతో నిరంతరం ఫ్లైయింట్ స్క్వాడ్ బృంధాలు, సెక్టోరల్ అధికారులు పర్యటిస్తున్నారు. ఈ టీం లు
వినియోగించే దాదాపు 1,680 వాహనాలు మరియు ఇ.వి.ఎం.ల రవాణాకు వినియోగించే వాహనాల కదలికలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ కేంద్రం నుండి పర్యవేక్షించడం జరుగుచున్నది.
ఫలితంగా నిఘా అన్నది పటిష్ట పరచడం జరిగింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ తెలుగు చానళ్లలో నిరంతరాయంగా ప్రసారం అయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు
ఎన్నికల ప్రతికూల వార్తలపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుచున్నది. ఇందుకై ఇద్దరు ఏ.ఎస్.ఓ.లతో పాటు భారీ సంఖ్యలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు షిప్టుల వారీగా పనిచేస్తున్నారు. అదే విదంగా ప్రముఖ ఆంగ్ల, తెలుగు దిన పత్రికల్లో ప్రచురితమయ్యే ఎన్నికల ప్రతికూల వార్తాంశాలపై కూడా తగుచర్యలు తీసుకోవడం జరుగుచున్నది.
ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే విధంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు మరియు ప్రజలు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలకు మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో ఎంతో స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా జరుగుతుంది అనే ఆశాభావాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వ్యక్తం చేశారు. మొత్తం మీద త్రిబుల్ సినీ ఎన్నికల సంఘం సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది అందుచేతనే దీనిని డేగ కన్ను అని పిలుచుకుంటున్నారు