న్యాయంగా ఉపాధ్యాయులకు హక్కులను కూడా యాచించే స్థితికి తీసుకువచ్చి విద్యారంగాన్ని ఉపాధ్యాయ లోకాన్ని అవమానించే విధంగా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫక్తు రాజకీయ పార్టీ లాగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యవహరించడం సిగ్గుచేటు,రాజకీయ ప్రయోజనాలకు వంత పాడే లాగా కృతజ్ఞత సభలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయ లోకం ఉపాధ్యాయ సంఘ ఎమ్మెల్సీలు మరియు సదరు సంఘ నాయకులు వంచించడం శ్రేయస్కరం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘకాలానికి పిఆర్సి ప్రకటించి,పూర్తిస్థాయి ప్రయోజనాలు అందక ఇప్పటికే అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయోజనాలు పిఆర్సి ఏరియర్స్, డిఎ బకాయిలు,HRA కోత మొదలైన ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయి విద్యా రంగంలో పదోన్నతులు, బదిలీలు, రెగ్యులర్ MEO పోస్టుల మంజూరు లేక కునారిల్లుతున్న వేళా, ఏ ఉద్దేశంతో కృతజ్ఞత సభలు నిర్వహించాలని ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తుంది ఉపాధ్యాయ సంఘం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీలు సంఘ నాయకులు రాజకీయాలు చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని దీనిని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నిర్మల్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉపాధ్యాయులు ఆత్మగౌరవం దేశ శ్రేయస్సు కోసమే పనిచేయడం ఉపాధ్యాయులుగా మన కర్తవ్యం అని తెలిపారు. ఈ అత్యవసర సమావేశంలో జిల్లా అధ్యక్షులు గొనెల శశిరాజ్, ప్రధాన కార్యదర్శి అంకం సుధాకర్, గౌరవ అధ్యక్షులు జి.రాజేశ్వర్ జిల్లా నాయకులు ధీరజ్, చంద్రప్రకాశ్, నవీన్ కుమార్,ఆర్.రాజేశ్వర్, దత్తురాం,విఠల్ తదితరులు పాల్గొన్నారు.