కరోనా వైరస్ చికిత్స కోసం సవరించిన క్లినికల్ మార్గదర్శకాలు జారీచేసింది. స్టెరాయిడ్స్ వంటి మందులు చాలా త్వరగా, ఎక్కువ మోతాదులో లేదా అవసరమైన దానికంటే ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు ఇన్వాసివ్ మ్యూకోర్మైకోసిస్ లేదా ‘బ్లాక్ ఫంగస్’ వంటి ద్వితీయ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించింది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. లేదా హైపోక్సియా లేకుండా ఎగువ శ్వాసకోశ లక్షణాలు తేలికపాటి వ్యాధిగా పరిగణించాలి. ఇంట్లో ఒంటరిగా ఉండాలని, హోం ఐసొలేషన్లో ఉంచేలా సూచించాలని నివేదికలో పేర్కొన్నారు. తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక జ్వరం లేదా ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం పాటు తీవ్రమైన దగ్గు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి.
90 నుంచి -93 శాతం మధ్య ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు అడ్మిషన్ పొందవచ్చు. వారికి ఆక్సిజన్ సపోర్టు ఇవ్వాలి. తీవ్రతను బట్టి ఐసీయూలో చేర్చాల్సి ఉంటుంది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం… “మధ్యస్థం నుండి తీవ్రమైన” వ్యాధి ఉన్న రోగులలో…ఏదైనా లక్షణం కనిపించిన 10 రోజుల్లోపు మూత్రపిండ లేదా హెపాటిక్ పనిచేయకపోతో అత్యవసర వినియోగ కింద మాత్రమే రెమ్డెసివిర్ ఆఫ్-లేబుల్ ను సిఫార్సు చేయవచ్చు. ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేని వారికి, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన వారికి మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
ఇక 60 ఏళ్లు పైబడిన వారు లేదా హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, డయాబెటిస్ మెల్లిటస్, హెచ్ఐవి, క్రియాశీల క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, కిడ్నీ లేదా కాలేయ వ్యాధి, సెరెబ్రోవాస్కులర్ వ్యాధి లేదా ఊబకాయం వంటి ఇతర రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్ర వైద్యారోగ్య శాఖ.