అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అధికారిక నివాసంలో దీపావళివేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్లతో పాటు ఎన్నారైలు సంబరాల్లో పాల్గొన్నారు. మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడం విశేషం. అందరితో కలిసి బాణసంచా కాల్చారు కమలా. ఆమె నివాసం నావల్ అబ్జర్వేటరీలో సంబరాలు జరగ్గా… జరిగిన ఈ సంబరాల్లో 100 మందికిపైగా ఎన్నారైలు పాల్గొన్నారు.
చీకటిపై వెలుగు ప్రభావంనుంచి స్ఫూర్తిపొందేందుకు ఉద్దేశించిన పండగ ఇదని… సంస్కృతుల పరిధులకు అతీతమైన సార్వత్రిక భావనఅని ఆమె అన్నారు. వెలుగు మార్గదర్శనంలో చీకటి నుంచి మనల్ని మనం ఉద్ధరించుకోవడంలో మన పాత్ర ఏమిటనేదాన్ని ఈ పండగ ఆలోచింపచేస్తందని అన్నారు.
అతిథులు చూస్తుండగా కమలా హారిస్ దంపతులిద్దరూ కాకరపువ్వొత్తులు కాల్చారు. అందరికీ పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ సాంగ్స్ కు కొందరు నృత్యం చేశారు.