హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మన్సూరాబాద్ సమీపంలో ఉన్న గోషాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. జడ్జెస్ కాలనీలో ఉన్న గోషాల షెడ్‌ను తెల్లవారుజామున జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చేశారని.. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని గోషాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. సదరు గోషాల స్థలాన్ని క్రైస్తవుల స్మశానం కోసం ప్రభుత్వం కేటాయిస్తుందని.. ఇది సరైన చర్య కాదని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి గోషాల షెడ్‌ను కూల్చుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనాస్థలికి పెద్ద ఎత్తున స్థానిక బజరంగ్ దళ్,వీహెచ్‌పీ, బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారని.. అధికారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.