శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లో ఊరేగింపుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. యావత్ దేశం ఆ ఘటనను ఖండిస్తుంటే…ముస్లింలను బాధితులుగా చూపేప్రయత్నం చేశారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఆ రోజు ఘటనకు సంబంధం లేని ఓఫొటోను జతచేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ఫొటో మధ్యప్రదేశ్ కు సంబంధించినది కాదని దిగ్విజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు విరుచుకుపడడంతో కామ్ గా ఆ చిత్రాన్ని తొలగించేశారు. అంత చేసిన ఆ పెద్దమనిషి క్షమాపణ చెప్పలేదు. పొరపాటైందన్న ఒక్కమాటా అనలేదు.
దిగ్విజయ్ షేర్ చేసిన ఫొటోలో ముస్లింలకు చెందిన నిర్మాణంపై ఓ యువకుడు కాషాయ జెండాను ఎగురవేస్తున్నాడు. ఆ ఫొటోను జతచేస్తూ కత్తులు, కర్రలు ధరించిన యువకులు ఓ మతపరమైన ప్రదేశంలో జెండాను ఎగురవేయడం సరైందేనా? నవమి ఊరేగింపులో ఆయుధాలు తీసుకెళ్లడానికి ఖర్గస్ అధికారులు వారిని అనుమతించారా? రాళ్లు రువ్వారంటూ అందరి ఇళ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తారా? శివాజీజీ లౌకిక ప్రభుత్వాన్ని నడుపుతానని మీరు ప్రమాణం చేసిన విషయం మరిచిపోవద్దు అని ట్వీట్ చేశారు.
@digvijaya_28 के लिए मध्यप्रदेश के मुख्यमंत्री @ChouhanShivraj का संदेश । pic.twitter.com/1AcNn7g22L
— Devendra Parashar (@DParashar17) April 12, 2022
ఇలా అసలు మధ్యప్రదేశ్ తో సంబంధమే లేని ఫొటోను షేర్ చేస్తూ అది ఖర్గోస్ కు చెందినదిగా ఆయన చిత్రీకరించారు. అయితే దిగ్విజయ్ వాదనల్ని తోసిపుచ్చారు శివ రాజ్ సింగ్. ఆ ఫొటో మధ్యప్రదేశ్ ది కాదని స్పష్టం చేశారు. “ఈ రోజు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఒక మతపరమైన ప్రదేశంలో జెండాను ఎగురవేసిన ఫోటోను ట్వీట్ కు జతచేశారు. ఇది మధ్యప్రదేశ్ దే కాదు. రాష్ట్రంలో మత కల్లోలాలు రేపేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తున్నారు. మత కల్లోలాలు సృష్టించాలనుకునే వారెవరైనా ఉపేక్షించబోను . ఇలాంటి ప్రయత్నాలను అస్సలు సహించబోను అని శివరాజ్ సింగ్ అన్నారు.
శివరాజ్ స్పందన చూసిన దిగ్విజయ్ వెంటనే ఆ ఫొటోను తొలగించారు. అయితే ఆ ఫొటో మధ్యప్రదేశ్ ది కాదని ఒక్కమాటా అనలేదు. క్షమాపణా చెప్పలేదు. అసలైతే ఆ ఫొటో బిహార్ కు సంబంధించినదని తేలింది.