సరస్వతీ శిశుమందిరాల్లో చదువుతున్న విద్యార్థుల్లో మత విద్వేషాలు పెంచుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలల హక్కుల పరిరక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. పాఠశాలల విద్యార్థుల ఫిర్యాదుపై స్పందిస్తూ… వారంరోజుల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహారీని కోరింది. దిగ్విజయ్ వ్యాఖ్యలతో విద్యార్థుల వ్యక్తిత్వం, గౌరవం దెబ్బతిన్నాయని..జువెనిల్ జస్టిస్ చట్టం నియమాలకూ దిగ్విజయ్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్కు ఇచ్చిన నోటీసుల్లో ఎన్సీపీసీఆర్ పేర్కొంది. ఈ లేఖ అందిన మూడు రోజుల్లోగా కమిషన్కు పూర్తి సమాచారం అందజేయాలని అందచేయాలని ఎన్సీపీసీఆర్ చైర్ పర్సన్ ప్రియాంక్ కనుంగో కోరారు. దిగ్విజయ్ సింగ్ ఆరోపణ సార్వత్రిక స్వభావం కలిగి ఉన్నాయని… అన్ని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలల విద్యార్థుల గౌరవాన్ని, స్వభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమేనని నోటీసులో పేర్కొన్నారు. ఇది జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 నిబంధనలతో పాటు ప్రాథమికంగా ఇది ఐపీసీ సెక్షన్లు 153A (బి) (బి), 504, 505 లను ఉల్లంఘిస్తుందని కూడా ఆమె స్పష్టం చేశారు.
భోపాల్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలలో దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ విద్యా విభాగం విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిశుమందిరాలు పనిచేస్తున్నాయి.