పన్ను వ్యవస్థలకు సంబంధించి అనేక కార్డులు అవసరం లేకుండా,, డిజిటల్ కార్డు ని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. దీనిని పాన్ కార్డ్ మరియు టాన్ కార్డుగా వ్యవహరిస్తారు. దీనికి క్యూ ఆర్ కోడ్ ఉండడం వలన అన్ని రకాల చెల్లింపు వ్యవహారాలకు పారదర్శకంగా నిలుస్తుంది.
పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.
పాత పాన్ నెంబర్లు అలాగే కొనసాగుతాయి అని తెలుస్తోంది. వీటిని క్యూ ఆర్ కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్ట్ రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో తయారు అవుతోంది. ఇది పన్ను చెల్లింపుదారులకు మరిత మెరుగైన డిజిటల్ అనుభవం ఇస్తుంది . అన్నిచోట్ల ఈ క్యూ ఆర్ కోడ్ ద్వారా పారదర్శకంగా పన్ను వ్యవహారాలు చేసుకోవచ్చు.