జర్నలిస్టులను జైలులో పెట్టి కష్టాలు పెడుతున్న దేశాల జాబితా విడుదల అయింది. మానవ హక్కుల కోసం గగ్గోలు పెట్టే కమ్యూనిస్టులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. జర్నలిస్టులను కఠినంగా అణచివేసే దేశాల్లో చైనా అగ్రగామిగా నిలుస్తోంది.
చైనా వంటి దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని ఈ సర్వేలో వెల్లడయింది.
చైనా, ఇజ్రాయెల్, మయన్మార్లు టాప్ త్రీ దేశాలుగా నిలుస్తున్నాయి . తరువాత బెలారస్, రష్యా ఉన్నాయి.
జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొనసాగుతున్న నిరంకుశ అణచివేత, యుద్ధం, రాజకీయ లేదా ఆర్థిక అస్థిరత వంటివి చెప్పుకోవాల్సిన కారణాలు.
చైనా, ఇజ్రాయెల్, ట్యునీషియా, అజర్బైజాన్ సహా అనేక దేశాలు జైలు శిక్ష తో పాటు అనేక నిర్బంధాలను అమలు చేస్తున్నాయి.
చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కేవలం ప్రభుత్వం అజమాయిషీ లో మాత్రమే పత్రికలు టీవీ చానల్స్ ఉంటాయి. ఇతర దేశాల నుంచి జర్నలిస్టులు అక్కడికి వెళ్లి వార్తలు రాయాలన్న చాలా చాలా కష్టం. చైనా లోపల బయట జర్నలిస్టులను అక్కడ చాలా వేధింపులకు గురిచేస్తారు. ఇప్పటికీ వందల సంఖ్యలో అక్కడ జర్నలిస్టులను రహస్యంగా బంధించి ఉంచారు. ఎప్పుడు వారిని విడుదల చేస్తారో కూడా తెలియనే తెలియదు.
కమ్యూనిస్టు దేశాలలో పరిస్థితులు ఇలా ఉంటే.. మనదేశంలోని కామ్రేడ్లు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తారు. భారత్ లోనే అన్యాయం జరిగిపోతోంది అంటూ గగ్గోలు పెట్టేస్తుంటారు.