కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతగా చలామణి అవుతున్న ప్రియాంక వాద్రా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వాయనాడ్ పార్లమెంటు స్థానానికి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కానీ ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ మీద ఇప్పుడు వివాదం నెలకొంది.
ఎన్నికల అఫిడవిట్లో అకస్మాత్తుగా ఆదాయం వచ్చినట్టు, అకస్మాత్తుగా ఆదాయం పడిపోయినట్లు గందరగోళం సృష్టించారు.
భర్థ రాబర్ట్ వాద్రా కు ఆదాయం గత నాలుగేళ్ళలో 55 లక్షల నుంచి 15 లక్షలకు పడిపోయింది, ప్రియాంక కు ఆదాయం మాత్రం పెరిగింది. ఆమె ఆస్తిలో రూ.7.74 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆమె మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. పన్ను మదింపు ప్రొసీడింగ్స్ కూడా ఇంకా సాగుతున్నాయి.
మొత్తం లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రియాంకకు మూడు బ్యాంక్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పిపిఎఫ్ ఖాతా, భర్త కానుకగా ఇచ్చిన హోండా కారు, రూ1.15కోట్ల విలువ చేసే బంగారం ఉన్నాయి. స్థిరాస్తుల్లో వారసత్వంగా వచ్చిన న్యూఢిల్లీ మెహ్రౌలీలోని వ్యవసాయ భూమిలో సగం వాటా, ఫామ్‌హౌస్‌లో సగం వాటా ఉన్నాయి. సిమ్లాలో సుమారు 6 కోట్ల విలువైన నివాసం పూర్తిగా ఆమె పేరు మీదనే ఉంది. ఆమెకు అప్పులు రూ.15.75 లక్షలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇంక 2012-13 సంవత్సరానికి ఆదాయపుపన్ను రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆమె ఇంకా రూ.15లక్షల పన్ను కట్టవలసి ఉందని అఫిడవిట్ చెబుతోంది.
ప్రియాంక గాంధీ ఆస్తుల లెక్కల మీద ప్రత్యర్థి పార్టీ బిజెపి అనుమానాలు వెలిబుచ్చింది. ఈ లెక్కలతో ప్రియాంక గిమ్మిక్కులు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అనుమానాలు వ్యక్తంచేసారు. ప్రియాంకకు ఆదాయమార్గం ఏమిటని ఆయన అడిగారు. భారతదేశపు షేర్‌మార్కెట్‌ను ప్రియాంక దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. భర్త రాబర్ట్ వాద్రా భూముల కుంభకోణాల్లో ప్రియాంకకు కూడా ప్రమేయం ఉందా అని ప్రశ్నించారు. ప్రియాంక తన అఫిడవిట్లో తప్పుడు గణాంకాలు చూపించారని ఆరోపించారు. 2013లో హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాబర్ట్ వాద్రా ఎన్నో ఎకరాల భూమిని నామమాత్రపు ధరలకు కొనుగోలు చేసారనీ, వాటివిలువ ఇప్పటికి కనీసం ఐదురెట్లయినా పెరిగిందనీ ప్రదీప్ చెప్పారు. రాబర్ట్ వాద్రా న్యూఢిల్లీలో కూడా ల్యాండ్ డీలింగ్స్ చేసారని గుర్తు చేసారు. కాబట్టి, ప్రియాంక అఫిడవిట్లో చెప్పినదానికంటె ఆమె ఆస్తులు, ఆదాయాల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఆరోపించారు.
మొత్తం మీద ప్రియాంక గాంధీ ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హడావుడిగా లెక్కలు చూపించేసి,, గట్టెక్కిపోయే మార్గం అన్వేషిస్తున్నట్లు అర్థమవుతుంది.