పశ్చిమబంగ సీఎం మమతాబెనర్జీ డిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు. ఆమె వెంట ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, ఎంఎస్ బెనర్జీలు ఉన్నారు. తన హస్తిన పర్యటనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శరద్ పవార్‌తో పాటు విపక్షనేతలందర్నీ కలవనున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల్ని ఏకం చేసేందుకే మమతా ఢిల్లీ పర్యటన అని టీఎంసీ వర్గాలంటున్నాయి. ఈ నెల 28వ తేదీన ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్నారు. అటు ప్రధాని నరేంద్రమోదీని సైతం మమతా బెనర్జీ కలవనున్నారు.
మమత ఇప్పటివరకు ఏడుసార్లు ఎంపీగా పనిచేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆమె హస్తినపు కాళ్లు కదుపుతున్నారని విశ్లేషకులంటున్నారు. అటు ప్రధాని అభ్యర్థి వరుసలో మమతా ముందు ఉంటారని…అంటున్నారు. దీంతో దీదీ పర్యటన ఆసక్తి రేపుతోంది.