వెస్ట్ బెంగాల్లో రాజకీయం హీటెక్కుతోంది. రోజురోజుకు పార్టీల ప్రచారం హోరెత్తుతుండటంతో పాటు.. అధికార టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ విపరీతంగా డబ్బులను పంచుతుందని ఆరోపించారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలకు ఓ పిలుపునిచ్చింది. డబ్బులు పంచుతున్న బీజేపీ వారిని పట్టిస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం కల్పిస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు.. ప్రధాని మోదీ పెద్ద అబద్దాల కోరు అని.. ఇలాంటి ప్రధానిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. మైనార్టీల ఓట్లను లాక్కునేందుకు బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని.. ఈ క్రమంలోనే ఇండియన్ సెక్యులర్ పార్టీని ముందుకు తీసుకువచ్చారంటూ ఆరోపించారు.