ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి మీద కలకాలం రేగుతోంది. సుదీర్ఘకాలం ఒడిశాకు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి మాదిరిగా కాకుండా ఆయన జీవన శైలి విభిన్నంగా కనిపిస్తుంది. భువనేశ్వర్ లోని ఒక మధ్యతరగతి ఇంట్లో ఆయన నివాసం ఉంటారు. ఎప్పుడో తప్ప ఆయన బయటకు కనిపించరు. అక్కడి నుంచే పరిపాలన మొత్తం నడిపిస్తారు.
ప్రస్తుతం ఒడిశా లో. పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ గట్టిగా తలపడుతోంది. కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నా …
వాటి ప్రభావం చాలా నామమాత్రం.
కొంతకాలంగా ఒడిశా ప్రభుత్వంలోనూ, బీజేడీ పార్టీ వ్యవహారాల్లో వీకే పాండియన్ పేరు బాగా వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన పాండియన్ ఒడిస్సా కేడర్ ఐఏఎస్ అధికారి. సమర్థవంతంగా పనిచేయడం ద్వారా నవీన్ పట్నాయక్ కు బాగా దగ్గరయ్యారు. దీంతో ఆయన్ని సీఎం పేషీ లో నియమించుకున్నారు. అప్పటినుంచి ఒడిస్సా పరిపాలనలో వీకే పాండియన్ పాత్ర అంతకంతకు ఎక్కువవుతోంది . మరోవైపు నవీన్ పట్నాయక్ పెళ్లి చేసుకోలేదు. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా దగ్గర ఉండరు.
ఈ పరిస్థితుల్లో వీకే పాండియన్ వ్యవహార శైలి మీద కొన్ని పుకార్లు ఉన్నాయి. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అప్పటి సన్నిహితులు శశికళ మాదిరిగా తయారవుతుంది అన్న మాట ఉంది. ఈ అనుమానాలు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయట పెట్టడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది
నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన వీకే పాండియన్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ, రాష్ట్రానికి ఒడిశా ముఖ్యమంత్రే కావాలని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే 25 ఏళ్ల బీజేడీ పాలనను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి మీద సంచలన ఆరోపణలు చేశారు.
“ప్రస్తుతం నవీన్ బాబు సన్నిహితులు అందరూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాలంలో ఆయన ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో చూసి బాధపడుతున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా నన్ను కలిస్తే తప్పకుండా నవీన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతారు. ఆయన తన పనులను తాను చేసుకోలేకపోతున్నారని చెప్పారు” అని ప్రధాని వెల్లడించారు.
“ఆయన ఆరోగ్య క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని ఆయన సన్నిహితులు నా దగ్గర వాపోయారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన వారే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, దీనిపై ఓ ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు చేస్తాం” అని మోదీ స్పష్టం చేశారు.
ఒడిశా సిఎం చేతి కదలికలను కూడా పాండియన్ నియంత్రిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించిన మరునాడు పట్నాయక్ ఆరోగ్య స్థితిపై ప్రధాని ఆ వ్యాఖ్య చేశారు. ఒక సమావేశంలో ఉపన్యాసం ఇస్తుండగా పట్నాయక్ చేయి వణుకుతుండగా దానిని ఒక బల్లపై పాండియన్ ఉంచడాన్ని చూపుతున్న ఒక వీడియోను హిమంత శర్మ ’ఎక్స్’ పోస్ట్‌లో పంచుకుంటూ, ‘ఇది చాలా బాధపెట్టే వీడియో. నవీన్ బాబు చేతి కదలికలను సైతం వికె పాండియన్ నియంత్రిస్తున్నారు’ అని పేర్కొన్నారు
మరోవైపు నరేంద్ర మోడీ ఆరోపణల మీద ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నానని అనుమానాలు పెట్టుకోవద్దని హితవు పలికారు.