సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారికా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆమెను టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ప్రకటించారు. అయితే ఈ అంశం రాజకీయ దుమారాన్ని లేపింది. పర్యాటక శాఖ మంత్రికి కానీ.. సీఎంవోకి కానీ తెలియకుండా చైర్మన్ ఎలా నిర్ణయం తీసుకుంటారని పెద్ద రచ్చ జరిగింది. అంతేకాదు.. పర్యాటక సంస్థ వెబ్సైట్ నుంచి హారికా వివరాలను కూడా తొలగించారు. సీఎం అనుమతి లేకుండా బ్రాండ్ అంబాసిడర్ నియామకం చెల్లదంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అంతేకాదు.. హారిక స్థానంలో మరొకరిని నియమిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దేత్తడి హారికా.. తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో రిలీజ్ చేసింది. పర్యాటక శాఖకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగలేనని.. కొన్ని కారణాలతో తాను వైదొలగుతున్నట్లు పేర్కొంది. తనకు సహకరించిన వారందరికీ హారిక ధన్యవాదాలు తెలిపారు.