పాకిస్థాన్ నుంచి విదేశీయుల బహిష్కరణ…
పాకిస్థాన్ ప్రభుత్వం దొంగాట కొనసాగిస్తోంది. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి తల దాచుకొంటున్న వారిని తిప్పి పంపించేందుకు,, ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది 30 లక్షల మంది ని దేశం నుంచి బయటకు గెంటేయాలని లక్ష్యం గా పెట్టుకొంది.
పాకిస్థాన్లో అక్రమంగా నిసిస్తున్న ఆఫ్ఘన్లపై వేగంగా చర్యలు తీసుకొంటోంది.
ఈదుల్ ఫితర్ పండుగ కారణంగా ఈ డ్రైవ్ కు కొంత బ్రేక్ పడింది . గత 18 నెలల్లో 8,45,000 మంది ఆఫ్ఘన్ల ను పంపించి వేశారని ప్రవాసుల అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. తమ దేశంలో 30 లక్షల మంది ఆఫ్ఘన్లు ఉన్నారని తెలిపింది. వారిలో 13,44,584 మందికి ధ్రువీకరణ రిజిస్ట్రేషన్ కార్డులు ఉన్నాయని, కాగా 8,07,402 మందికి ఆఫ్ఘన్ సిటిజెన్ కార్డులున్నాయని పాకిస్థాన్ తెలిపింది. ఒకసారి డిపోర్ట్ చేసిన వారు తిరిగి వెనక్కి రాకుండా చూస్తామని పాకిస్థాన్ అంటోంది. రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ ఉన్నవారు జూన్ 30 వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది.
పాకిస్తాన్లో ఇంత గొడవ జరుగుతున్న మానవ హక్కుల సంఘాలు నోరు మెదపడం లేదు. భారత్లో జనాభా లెక్కలు చేపడతామన్న గాని గుండెలు బాదేసుకుంటున్నారు. దీనిని బట్టి కుహానా సెక్యూరిస్టుల అసలు స్వరూపం అర్థం చేసుకోవచ్చు.