నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్లు ఈనెల 28న కుప్పకూలనున్నాయి. టవర్లను పేల్చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ టవర్స్ పరిధిలో ఎక్స్ క్లూజివ్ జోన్ ఏర్పాటు చేశారు. వాటిని కూల్చేవరకు ఆ ప్రాంతంలో డ్రోన్ల్ ఎగిరేందుకు వీల్లేదు.
నోయిడాలోని సెక్టార్ 93 ఏ లో ఉన్న ఈ ట్విన్ టవర్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు సుప్రీం కోర్టు తేల్చింది. దీంతో అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు.
వంద మీటర్ల పొడవైన 40 అంతస్థుల అదివారం పూర్తిగా నేలమట్టం కానున్నాయి. ఇప్పటికే టవర్స్ కు ముందు వైపు 450 మీటర్లమేర, మూడువైపులా 250 మీటర్ల మేర ఈ ఎక్స్ క్లూజివ్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక అవి కూల్చే సమయంలో అంటే ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలనుంచి 2.45 వరకు ఆ మార్గం గుండా రాకపోకల్ని నిషేధించనున్నారు.
ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు 3700 కిలోల పేలుడు పదార్థాన్ని సిద్ధం చేశారు.15 సెకన్ల వ్యవధిలో అవి పేకమేడల్లా కూలిపోనున్నాయి.