మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బెదిరింపులను ఎదుర్కొంటున్న బీజేపీ మాజీఅధికార ప్రతినిధి నూపుర్ శర్మ విజ్ఞప్తిని డిల్లీ పోలీసులు మన్నించారు. తనకు ముప్పు ఉన్నందువల్ల తనతో పాటు ఓ రివాల్వర్ తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆమె చేసిన దరఖాస్తుపై సానుకూలంగా స్పందించారు. ఆమెకు గన్ లైసెన్స్ మంజూరు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నూపుర్ కు నాటి నుంచి హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారిస్తున్నారు.