2020లో జఫ్రాబాద్‌లో జరిగిన ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి ఓ ఫొటో అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసుల మీదకు పిస్టల్ ఎక్కుపెట్టిన కాల్పులు జరిగిన షారుక్ ఖాన్ అలియాస్ పఠాన్ ను ఎవరూ మర్చిపోయి ఉండరు. అప్పుడాపఠాన్ కు ఆ ఆయుధాన్ని సరఫరా చేసిన పేరుమోసిన ఆయుధాల అక్రమవ్యాపారి బాబు వాసిమ్ ను ఢిల్లీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. నాడు ఢిల్లీ అల్లర్లలో 53 మంది మరణించగా, కనీసం 581 మంది గాయపడ్డారు.
ఏసీపీ అత్తర్ సింగ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు శివకుమార్, జితేందర్ మావి నేతృత్వంలోని బృందం ఏప్రిల్ 7వ తేదీ గురువారం ఢిల్లీలోని తాహిర్పూర్లో రాజీవ్ గాంధీ ఆసుపత్రికి పక్కనే ఉన్న పార్కు సమీపంలో బాబు వసీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వసీం అరెస్టు చేసే సమయంలో ఐదు లైవ్ కాట్రిడ్జ్‌లతో కూడిన ఒక సెమీ ఆటోమేటిక్ పిస్టల్.32 స్వాధీనం చేసుకున్నారు.
యూపీలో మీరట్‌లోని వికాస్పురి కాలనీకి చెందిన వసీం, ఢిల్లీ అల్లర్లకు ముందు షారుక్ ఖాన్‌కు పిస్టల్‌ను సరఫరా చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఆ కేసులో 2021 మార్చి 16న ట్రయల్ కోర్టు అతన్ని నేరస్థుడిగా ప్రకటించింది.
ఢిల్లీ ఎన్సీఆర్లోని ట్రాన్స్-యమునా ప్రాంతం తోపాటు పశ్చిమ యూపీలోని ఇతర పరిసర ప్రాంతాలకు బాబు వసీం తరచూ వస్తున్నట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్స్పెక్టర్ శివ కుమార్ నేతృత్వంలోని బృందం బాబు వసీం నిఘా సమాచారాన్ని సేకరించింది. గత 10 ఏళ్లలో పశ్చిమ యూపీ, ఢిల్లీ ఎన్సీఆర్లలో అనేక మంది గ్యాంగ్స్టర్లకు.. భయంకరమైన నేరస్థులకు.. తుపాకీలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినట్లు బాబు వసీం అంగీకరించినట్లు సమాచారం. ఢిల్లీలోని ట్రాన్స్-యమునా ప్రాంతంలో నసీర్ గ్యాంగ్‌కు ప్రధాన ప్రత్యర్థులైన ఇర్ఫాన్ అలియాస్ చైను పెహ్ల్వాన్ గ్యాంగ్ సభ్యులకు తుపాకీలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినట్లు అతను వెల్లడించాడు. గత రెండున్నరేళ్లలో ఢిల్లీ-ఎన్సీఆర్లో నేరస్తులకు.. ఆయుధాల అక్రమ రవాణాదారులకు.. 250కి పైగా తుపాకీలను సరఫరా చేసినట్లు వసీం వెల్లడించాడు. ఢిల్లీ, యూపీలలో కాంట్రాక్ట్ హత్యలు, కాల్పులు, హత్యలు, హత్యాయత్నాలు, పోలీసులపై దాడి, ఆయుధాల స్మగ్లింగ్ మొదలైన వాటితో సహా కనీసం ఏడు క్రిమినల్ కేసుల్లో బాబు వసీమ్ ప్రమేయం ఉంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)