కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు పోస్టర్ రూపొందించిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ పోస్టర్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. హిందూ దేవతను అవమానించిన ఆమెను శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో పలువురు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ, యూపీల్లో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 6న హాజరుకావాలంటూ ఢిల్లీ కోర్టు ఆమెకు సమన్లు జారీచేసింది. గోమహాసభ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ విచారణ మొదలుపెట్టింది.