తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇక కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ వద్యాసంస్థలు మూసివేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగగా జరుగుతాయని నిన్న యూనివర్సిటీలు నిన్న ప్రకటించాయి కానీ మళ్లీ సమీక్ష నిర్వహించిన ఉన్నతవిద్యామండలి ..సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలకు సూచించింది.