పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ… కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీసింది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ ఓటమిపాలయ్యారు. మోగ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాళవిక ఆప్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అసలైతే మోగ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కు కంచుకోట. 1977 నుండి 2017 వరకు అక్కడ హస్తం పార్టీ అభ్యర్థే గెలుస్తూ వచ్చారు.
ఈ ఎన్నికల్లో మాత్రం మోగను నిలుపుకోలేకపోయింది. కాంగ్రెస్ ను మొత్తంగా ఊడ్చేసి అక్కడ పాగా వేసింది ఆప్.