ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేయబోతున్నట్టు కాంగ్రెస్ మాజీఎంపీ రేణుకాచౌదరి ట్వీట్ చేశారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి ప్రధానిమీద కేసు వేస్తానని ప్రకటించారు.2018లో రాజ్యసభ సాక్షిగా మోదీ తనను ‘శూర్పణఖ’ అని సంబోధించారని..ఓ రాక్షసిగా అభివర్ణించడం తనను అవమానించడమేనని ఆమె అన్నారు. ఇప్పుడు దేశంలోని కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చూస్తానని ట్వీట్ చేశారు.
2018 ఫిబ్రవరి 7న ప్రధాని ప్రసంగిస్తుండగా రేణుకాచౌదరి పెద్దపెట్టున నవ్వసాగారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమెను గట్టిగా వారించబోయారు. దీంతో మోదీ ‘‘సభాపతి జీ, మేరీ ఆప్కో ప్రార్థనా హై రేణుకా జీ కో ఆప్ కుచ్ మత్ కహియే. రామాయణం సీరియల్ కే బాద్ ఐసే హసీ సునానే కా ఆజ్ సౌభాగ్య మిలా హై’’ అన్నారు. అంటే…గౌరవనీయమైన చైర్మన్ గారూ…రేణుకా జీని ఏమీ అనకండి. రామాయణం సీరియల్ తర్వాత, మళ్లీ ఆలాంటి నవ్వు వినే అవకాశం మనకు వచ్చింది అని. దీంతో సభమొత్తం నవ్వులు విరిశాయి. తాజాగా రాహుల్ కు శిక్ష నేపథ్యంలో రేణుకా ఆ వీడియోను జత చేస్తూ మోదీపై పరువునష్టం కేసు వేస్తున్నట్టు ట్వీట్ చేశారు. అయితే ఆమె ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మోదీ ఆమెను శూర్పనఖ అనలేదని… ఆమె కేసు వేసినా చెల్లదని ట్వీట్లు చేస్తున్నారు.
https://twitter.com/RenukaCCongress/status/1638927867018092545?s=20
మోదీపై పరువునష్టం కేసు వేస్తున్నా – కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చూస్తా – రేణుకాచౌదరి

Share: