మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ క్షేత్రం అయిన త్రయంబకేశ్వర్ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయాన్ని శుభ్రపరిచి, శుద్ధి కర్మలు చేసి హారతి నిర్వహించాయి.
13 మే 2023న, స్థానిక ముస్లింలు ఆలయంలోని శివలింగంపై చాదర్ వేసే ప్రయత్నం చేసిన సంగతితెలిసిందే. అక్కడున్న సెక్యూరిటీ భక్తులు వారిని అడ్డుకున్నారు.
ఇవాళ ఉదయం హిందూ మహాసభ, బ్రాహ్మణ మహాసంఘ్, నాసిక్ పురోహిత్ సంఘ్, త్రయంబకేశ్వర్ పురోహిత్ సంఘ్ సహా వివిధ హిందూ సంస్థల సభ్యులు త్రయంబకేశ్వర ఆలయానికి చేరుకున్నారు. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మహా హారతి నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు.
https://twitter.com/erbmjha/status/1658809305242411010?s=20
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తునకు సిట్ ను నియమించారు.
త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురిని అకీల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకీల్ సయ్యద్, మతిన్ రాజు సయ్యద్ సలీం బక్షు సయ్యద్ గా గుర్తించారు. ఊరేగింపుగా వచ్చి చాదర్ తో ఆలయప్రవేశం చేయబోగా అక్కడున్నవారు అడ్డుకున్నారు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది.