ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి సంబంధించి వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో గెరార్డ్ బట్లర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
గతంలో వారణాసి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు భట్లర్ ఆ అనుభూతుల్ని వర్ణిస్తూ ఒక ట్వీట్ చేశారు. గంగా నది ఒడ్డున చాలా ప్రశాంతత పొందానని, ప్రశాంతంగా ధ్యానం చేసుకో గలిగానని ఆయన వర్ణించారు. అసలు వారణాసి యాత్ర అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అని పేర్కొన్నారు. భగవంతుడి పిలుపు లేక సందేశం ఉంటేనే ఇటువంటివి సాధ్యమవుతాయి అన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. వారణాసి పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించాలని అది తనకు చాలా శక్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
తాజాగా దీపావళి ముంగిట ఈ ట్వీట్ మరోసారి వైరల్ అవుతోంది. దీపావళి కోసం గంగానది ఒడ్డున దీపాలు వెలిగించి సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో గంగా నది మరియు వారణాసి గొప్పతనాన్ని తెలియజేస్తూ బట్ల ర్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.