కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 26 వేల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే.. దేశంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్‌ను మోగిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో వేగంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 59,258 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా బారినపడి 685 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,66,862కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,10,319గా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇక మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9,01,98,673 మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.