బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు ప్రభుత్వం అండగా నిలిచింది.
దళిత బందు పథకం ద్వారాచేయూతనిచ్చింది..పథకం కింద మంత్రి ఎర్రబెల్లి మొగిలయ్యకు కారు అందజేశారు.
బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించారు పస్తం మొగిలయ్య, కొమురమ్మ. అయితే వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు దళిత బంధు పథకంలో చేర్చారు. పథకం ద్వారా మంజూరు అయిన కారును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్.. మొగిలయ్య దంపతులకు అందజేశారు.