***************************************ఇది భారతావని వారి వ్యాఖ్యానం విమర్శ క్రింది భాగంనుండి మొదలు ***************************************
భారత సమాజాన్ని పీడిస్తున్న జాడ్యాలలో కులతత్త్వం అతి పెద్దది. ఈ కులతత్వ పిశాచాన్ని భారత సమాజం నుండి తరిమి కొట్టే వరకు పోరాడుతూనే వుండాలి. ప్రభుత్వ చట్టాల ద్వారా సామాజిక సంస్కరణల ద్వారా, పట్టణాల అభివృద్ధి ద్వారా, పరిశ్రమల అభివృద్ధి ద్వారా హరిజనుల, వనవాసిలపై కుల వివక్ష తగ్గింది. అయినప్పటికీ మొత్తం వివక్షను పూర్తిగా తీసివెయ్యడానికి సమాజం చాలా కృషి చేయాల్సి వుంది.
ఈ కుల వివక్ష తీసివెయ్యడానికి చేస్తున్న కృషిలో కలతలు సృష్టించే కూటమి ఒకటి భారతే దేశంలో పుట్టింది. ద్వేషభావంతో వున్న ముస్లిం లు, క్రిస్టియన్ మిషనరీలు, తప్పుడు దిశగా సాగుతున్న కుహనా మేధావులు, తామే గొప్ప అనుకుని దారితప్పిన దళిత నాయకులు మరియు మార్క్సిస్ట్ లు, ఆంగ్ల భాషకై వెంపర్లాడే మేధావులు ఈమధ్యనే వీరితో చేరి భారతచరిత్ర పై అధ్యయనం చేస్తున్న పాశ్చాత్య చరిత్రకారులు మరియు దక్షిణ ఆసియ నిపుణుల తో కూడిన ఈ కూటమిని కలిపే ప్రధాన విషయం హిందువులని మరియు హిందూమతాన్ని ద్వేషించడం. హిందూమతద్వేషం తో పుట్టిన కూటమి అది.
కంచె అయిలయ్య రాసిన “Why I Am Not a Hindu “ అనే పుస్తకం ఈ కూటమి నుండి పుట్టినదే . పుస్తకం ప్రచురించినప్పటి నుండి కంచె అయిలయ్య క్రిస్టియన్ మిషనరీలకు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. పైన చెప్పిన మూఠా ఆయన్ని నెత్తిన ఎత్తుకుంది. కేవలం ఆ పేరుని వాడుకొని ఇబ్న్ వరఖ్ “నేనెందుకు ముస్లిం కాదు ? “ (“why I am not a muslim”) మరియు ప్రఖ్యాతి గాంచిన బెర్ట్రాండ్ రస్సెల్ యొక్క “నేనెందుకు క్రిస్టియన్ కాదు” అనే పుస్తకాల సరసన చేర్చే ప్రయత్నం ఐలయ్య చేసారు. ఈ పుస్తకం వాటి ముందు చెత్తతో సమానం. ద్వేషంతో వాస్తవాలను పక్కనపెట్టి సగం తెలిసి సగం తెలియని జ్ఞానంతో రాసిన తప్పుల తడక ఆ పుస్తకం. ఒక గట్టి పరిశోధన, దీర్ఘ మేధోమధనం లేకుండా తనకు తెలిసిన ఆవు వ్యాసం రాసి ఐలయ్య తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. కేవలం కొన్ని పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో తప్ప ఆ పుస్తకం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. లిసా మేకైన్ , లిండా హెస్ , ఎలిజా కెంట్ లాంటి మేధావులు ఇంటర్నెట్ చర్చల్లో ఐలయ్య పుస్తకాన్నిఎవరైనా హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలంటే చదివే ప్రాథమిక పుస్తకం కింద పరిగణించారు. ఒక మతంపై విమర్శనాత్మకంగా నిబద్దతతో రాసే పుస్తకాలు పరిశోధనకు ఉపయోగపడతాయి కానీ అజ్ఞానంతో ద్వేషభావంతో రాసే ఇలాంటి పుస్తకాన్ని అమెరికా లోని కొలంబియా విశ్వవిద్యాలయం పాఠ్యంశంగా వాడటం శోచనీయం. ఇబ్న్ వరఖ్ పుస్తకంగాని లేదా బెర్ట్రాండ్ రస్సెల్ పుస్తకం గాని ఆ మతాల మౌలిక అవగాహన కల్పించే కోర్సులలో కూడా వాడరు. కానీ హిందూ మతంపై ఎంతో పరిశోధనతో రాసిన గ్రంధాలు చాలా ఉండగా, వాటిని వాడకుండా ద్వేషభావంతో విషయం తెలియకుండా రాసిన ఈ పుస్తకాన్ని పాశ్చాత్య మేధావులు వాడటం తప్పు.
20వ శతాబ్దంలో జర్మనీ విశ్వవిద్యాలయాలలో యాదులను తూలనాడటాన్ని ఒక గొప్ప ఫాషన్ గా భావించే ద్వేష పూరిత మానసిక స్థితి వుండేది. 21 వ శతాబ్దంలో హిందూ ధర్మాన్ని కించపరిచే పుస్తకాలని అధ్యాపకులు విశ్వవిద్యాలయాలలో వాడటం జర్మనీలో యాదులను తులనాడటాన్ని గుర్తుచేస్తుంది. జర్మనీ మేధావుల ద్వేషంతో పాటు మరికొన్ని సంఘటనలోంచి పుట్టినవాడే హిట్లర్ అన్నది జగద్విదితం. పక్షపాతధోరణితో హిందూధర్మాన్ని చూసి, దక్షిణఆసియ మరియు ఇండాలజి కాన్ఫరెన్స్‌లలో హిందూధర్మాన్ని తూలనాడి తిట్టి పరిశోధనలు చేస్తే ఈ కుహానా మేధావులుకు త్వరగా స్కాలర్షిప్ (Scholarship ) లు త్వరగా ప్రమోషన్ లు రావటం జరుగుతాయి. ఈ మేధావులు మొదట హిందూధర్మాన్ని తిట్టి దాన్ని “హిందుత్వ” వాదమని నిర్వచిస్తారు. ఒక్కసారి హిందుత్వ వాదమనేపదం వచ్చాక వీరికి హిందూధర్మాన్ని తిట్టడానికి పట్టపగ్గాలు వుండవు. ఐలయ్య పుస్తకం పేరుకూడా “నేనెందుకు హిందువును కాను – హిందుత్వం పై ఒక శూద్రుడి విమర్శ” . అయితే హిందూధర్మంపై మేధావుల ద్వేషం అతిపెద్ద అంశం దానిపై మరొక్కసారి రాయాల్సిన అవసరంవుంది. ఈ విమర్శలో ఈ కుహనామేధావుల ద్వేషంపై ప్రస్తావించటం లేదు .
MVR శాస్త్రి గారు “నేనెందుకు హిందువు కాదు “ అనే పుస్తకంపై సహేతుక మేధో విమర్శను నాలుగు భాగాలుగా ఆంగ్లంలో రాసారు. దానికి తెలుగు అనువాదం శ్రీ సత్యదేవ ప్రసాద్ గారు రెండు భాగాలలో రాయటం జరిగింది. భారతీయ ప్రజ్ఞ సెప్టెంబర్ 2000 మరియు అక్టోబర్ 2000 సంచికలలో వాటిని ప్రచురించటం జరిగింది కానీ అవి అనుకోకుండా ఇంటర్నెట్ లో ప్రస్తుతందొరకటం లేదు. మేము ఆంగ్ల మాతృకని చదివేవారి సౌలభ్యం కోసం కొన్ని చిన్న మార్పులతో భావం పోకుండా తిరిగి ప్రచురించాం.
************************************************************************
నేనెందుకు హిందువును కాదు సహేతుక విమర్శ — MVR శాస్త్రి
ఈ సహస్రాబ్ది లో ప్రచురించిన అయిదు గొప్ప పుస్తకాలేమిటి ? ఈ ప్రశ్న బాగా బాగా అనుభవజ్ఞులైన పుస్తకాల పురుగుల్ని కూడా ఇరుకున పెడుతుంది. ఎందుకు ? ఒక్క తెలుగుభాషనే తీసుకుందాం గత వేయి సంవత్సరాలలో ఎన్నో కథలు, నవలలు, కవితలు, కావ్యాలు, పద్యాలు వచ్చాయి.
ఇక భారత దేశం లో డజన్ కు పైగా ప్రాంతీయ భాషలు వున్నాయి. వాటికి ఇంగ్లీష్ మరియు హిందీ భాషా సాహిత్యం కలిపితే కొన్ని వేల కొద్దీ పుస్తకాలు ఉంటాయి. అంత పెద్ద పుస్తకరాశిలో ఒక అయిదు పుస్తకాలని ఎంచుకోమంటే విజ్ఞుడైన పుస్తకపురుగులకు కూడా కష్టతరం.
అంత క్లిష్టమైన ఎంపిక ఢిల్లీకి చెందిన ది పయోనీర్ కి చిటికెలో చేసింది. వారి జాబితా లో ఈ క్రింది పుస్తకాలు సహస్రాబ్ది లో గొప్పవి
అన్ హియలేషన్ అఫ్ కాస్ట్ Dr.అంబెడ్కర్
గోపిత నాందేవ్ దస్సాల్
అన్ టచబుల్ ముల్కరాజ్ ఆనంద్
గబ్బిలం జాషువా
ఇక చివరిగా
వై ఐ ఆమ్ నాట్ ఏ హిందూ ఐలయ్య
పైన చెప్పిన పుస్తకాలలో ఒక్క ఐలయ్య పుస్తకం తప్ప మిగతావి ఎన్నో సంవత్సరాల క్రితం రచించి ప్రచురింపబడినవి. ఐలయ్య పుస్తకం కొత్తదైనా ఇంగ్లీషులో ని మాతృకని తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో ప్రచురించారు.
అలా జాబితాలో చేర్చేసరికి ప్రజల్లో ఇంత “సహస్రాబ్దం లో గొప్ప” పుస్తకమేమిటా అని కుతూహలం కలుగుతుంది. చిత్రమేమిటంటే సహస్రాబ్ది లో గొప్ప పుస్తకం అని బాకాఊదే రచయిత ఆ పుస్తకం ప్రచురించకన్నా ముందే ఆ పుస్తకం గొప్ప పుస్తకం అని నమ్ముకున్నాడు. పుస్తకంలో అయన రాసిన “ఈ దేశానికి నా జన్మదినం కన్నా ఈ పుస్తక ప్రచురణ దినం ఎంతో గొప్పది. ఈ పుస్తకం చరిత్రను ప్రభావితం చేస్తుంది” లాంటి స్వంత ప్రకటన రచయిత యొక్క పరిణితిచెందని మానసిక స్థితిని తెలియజేస్తుంది.
విషయపరిజ్ఞానం వున్నదనుకున్న మన రచయిత తన మహాపుస్తకం ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకంగా వాడుతున్నారని చెప్పుతాడు. ఎందరో సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, రాజనీతి చదివిన మేధావులు, ఆర్థికవేత్తలు, తత్వవేత్తలు తన పుస్తకాన్ని అక్షరం వదలకుండా చదువుతున్నారట !!! ఇక తన గ్రంథం విదేశాలలో భారత దేశం గురించి తెలుసుకోవడానికి వాడుతున్నారట. అమెరికా రాయబారి భారతదేశ నిజస్వరూపాన్ని నిర్దిష్టంగా ఈ పుస్తకం చూపిస్తుందని అన్నాడట!!!. ఎంత అద్భుతం
కానీ నిజమైన భారతావని గురించి ఐలయ్య రాసాడా ? అంత కటువైన సత్యాలు ఏమి రాసాడు? సర్లెండి అవి అప్రస్తుత ప్రశ్నలు.
ఇప్పటివరకు దళితులపై, బహుజనులపై అణగదొక్క బడిన వారిపై కొన్ని వందల పుస్తకాలు వచ్చాయి. వాటిలో చాలామటుకు రాసినవారు నిజంగా అణగదొక్కబడిన వారు. కానీ ఐలయ్య తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తనను తానూ అణగదొక్కబడినవాడుగా నిర్ధారించుకున్నాడు. తన గురించి తానూ విశదంగా రాసుకున్న దానిప్రకారం “ అయన వెనుకబడిన కురుమ కులం లో వెనుకబడ్డ తెలంగాణాలో పుట్టటమే కాక నిజంగా తన చిన్నతనం లో గొర్రెలను కాసే పని చేసాడు”.
తన పుస్తకంలో అయన కులవృత్తిని, కులంలో వాడే భాషనీ ఎలా నేర్చుకున్నాడో వివరంగా చెప్పాడు. ఎలా నల్ల గొఱ్ఱె ను, బొల్లి గొఱ్ఱెను పుల్ల గొఱ్ఱె ను గుర్తుపట్టవచ్చు ? ఎయె రోగాలు గొర్రెలకు ఎలా వస్తాయి? ఎలా వనమూలికల సహాయంతో గొర్రెలకు వైద్యం చేయవచ్చు? అన్ని మందులు విఫలం అయితే ఇనుప చువ్వతో వాతపెట్టి రోగాన్ని ఎలా నయం చేయవచ్చు. అయన గొర్రెలు ఈనినప్పుడు ఎలా తాను మంత్రసాని పాత్ర వహించాడు ? గొర్రెపిల్లలని ఎలా పెంచాడు ? గొర్రెలకు నొప్పి తెలియకుండా ఎలా ఉన్నిని తీసేవాడు. మన సహరాబ్ది రచయిత గారు అనుభవం మరియు కులం వృత్తి ద్వారా నేర్చుకున్న విజ్ఞానం అది.
ఒక్క కులవృత్తి మాత్రమే కాక ఉన్నత చదువులు చదివి ఉస్మానియా విద్యాలయంలో రాజనీతిలో డాక్టరేట్ పట్టా కూడా సాధించాడు. తన చిన్నతనంలో నేర్చుకున్న గొర్రెల పెంపకం తో పాటు కష్టపడి తెచ్చుకున్న డాక్టరేట్ డిగ్రీ పరిజ్ఞానం వాడి కొత్త “ దళిత్ – బహుజన్” సిద్ధాంతాలను తయారుచేసాడు.
చిన్నతనంలో జనాలు చెప్పుకుంటున్న ఆలోచనలను, సమాజ పోకడని తన విద్యద్వార విశ్లేషించినట్లయితే తన చదువుకి ఫలితం ఉండేది. తనెంతో ప్రేమించే దళిత – బహుజన వాదానికి కూడా ఆ విద్య కాస్త ఉపయోగపడేది. కానీ ఆలాజరగ లేదు. పొంతనలేని పెద్ద చదువులు చదువుతున్నప్పుడు చిన్నప్పుడు తాను విన్న విషయాలు, సమాజంలోని తారతమ్య భావాలు నిజమేనా అని ఎప్పుడు నిర్దారించుకోలేదు. బ్రాహ్మణులపై లేదా బ్రాహ్మణిజంపై విషపూరిత వ్యాఖ్యలు చేసే ముందు ఎవరైనా విజ్ఞులని తాను చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంతుందో లేదో అని అడగలేదు. ప్రస్తుత కాలపరిస్థితుల్లో అయన చేసిన వ్యాఖ్యలు వర్తిస్తాయా లేదా అని కూడా చూసుకోలేదు.
బ్రాహ్మణుల గూర్చి పక్షపాతం లేకుండా, పద్దతి ప్రకారం చదివి ఆ వ్యాఖ్యలు చేసినట్టు చిన్న దాఖలా కూడా కనిపించదు. ఎవరో ఒకరిద్దరు సహాధ్యాయులతో మాట్లాడి బ్రాహ్మణులపై, బ్రాహ్మణిజంపై ఉత్తుత్తి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఇక ఎవరా సహాధ్యాయులు? అయన చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మణ కులంలో పుట్టి హిందూమతాన్ని అమితంగా ద్వేషించే స్త్రీ వాదులు !!!
చిన్నతనం లో ఆయనకి కొన్ని విషయాలు అర్థమయ్యేవి కావుట ( ఆ విషయం పుస్తకం లో తానే రాసుకున్నాడు ). చిన్నతనం లో సరే మరి “బుద్దెరిగాక” వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడా ?
పార్ట్ 2 తరువాత
శ్రీ MVR శాస్త్రి గారి సహేతుక విమర్శ అనువాదం “కంచె ఐలయ్య నేనెందుకు హిందువును కాదు” – Part 1

Share: