ప్రధానమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకొని 2 రోజులుగా చాలా మంది రెచ్చిపోతున్నారు. భద్రతాబలగాల వైఫల్యం వల్లనే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. కానీ, ఈ గ్యాంగ్ మాటలు వినే ముందు మనం కొన్ని విషయాలు గమనించాలి. మన భద్రతా బలగాలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాయి కాబట్టి ఇప్పటికే భారీ భారీ ప్రమాదాలు తప్పించగలిగారు.
కేవలం ఈ నెల రోజుల్లోనే 8 సార్లు ఇస్లామిక్ ఉగ్రవాదుల వ్యూహాలను భారత భద్రతా బలగాలు, నిఘా సంస్థలు తుత్తునీయలు చేశాయి. వారు రచించిన ప్రతి వ్యూహాన్ని కూడా మొగ్గలోనే తుంచేసి, దేశాన్ని రక్షించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్.
1. ఢిల్లీ పరిధిలో 2900 కిలోల పేలుడు పదార్థాలను, 5 కిలోల భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇస్లామిక్ ఉగ్రవాదుల మాడ్యుల్ దురాగతం బయటపడింది. వీటిని ఉగ్రవాదులు వాడి ఉంటే కొన్ని వేల మంది చనిపోయి ఉండేవారు.
2. ఈ నెల తొమ్మిదో తేదీన ముగ్గురు ISIS ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు భారత్ లో పేలుళ్లకు రచన చేశారు. వీరి వ్యూహాన్ని కూడా భద్రతా బలగాలు ముందుకు సాగనీయలేదు.
3. ఇదే నెల ఏడో తేదీన ఒసామా ఉమర్ అనే టెర్రరిస్ట్ నాయకుడిని రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేసింది. వీరందరికీ ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్ర కమాండర్లతో సంబంధాలు ఉన్నాయి.
4. అక్టోబర్ 28 వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ ఐటీ ఉద్యోగిని మహారాష్ట్ర ఏటీఎస్ పూణెలో అరెస్ట్ చేసింది. అతని దగ్గర ఉగ్రవాదుల కుట్రలకు సంబంధించిన కీలక సమాచారం లభ్యం అయింది.
5. అక్టోబర్ 24 న ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీస్ టీమ్ ఛేదించింది. దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు వేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసింది.
6. అదే నెల 17 వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దర్ని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిది యూపీ కాగా, మరొకరిది మహారాష్ట్ర. ఈ ఇద్దరి నుంచీ చాలా కీలక సమాచారం లభించింది.
7.అదే నెల 15 న సరిహద్దు వ్యవస్థీకృత ఆయుధాల మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు, అమృత్‌సర్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి 10 అధునాతన పిస్టళ్లు, 500 గ్రాముల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
8. అదే పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ టెర్రర్ మాడ్యుల్ ను ఛేదించారు. పేలుళ్లకు ప్రణాళిక వేసిన జలంధర్ కి చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాటు RDX అమర్చిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇన్ని గండాల నుంచి దేశాన్ని నరేంద్రమోదీ టీమ్ రక్షించింది. వరుస పెట్టి అందరినీ అరెస్టులు చేస్తుండటంతో ఉగ్రవాది ఒమర్ వణికి పోయాడు. తనకు చావు తప్పదని గ్రహించి పేలుడు పదార్థాలతో ఈ ఘాతుకానికి ఒడికట్టాడు. భారీ ప్రమాదాల నుంచి రక్షించిన మోదీ టీమ్ కు థాంక్ప్ చెప్పాలా, లేక సూటిపోటి అభాండాలు వేయాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.



