శనివారం సాయంత్రం క్రికెట్ అభిమానులు పెద్ద పండగ చేసుకుంటున్నారు. చాలాకాలం తర్వాత ప్రపంచ కప్ ఫైనల్స్లో భారత్ జట్టు ఆడుతోంది. కీలకమైన మ్యాచ్లో దక్షిణాఫ్రికా తో భారత్ సేన తలపడుతోంది. దీంతో శనివారం సాయంత్రం భారతదేశంలోని మెజారిటీ జనాభా టీవీలకు మొబైల్స్ కు అతుక్కుపోవడం ఖాయం.
ఈ ఏడాది ప్రపంచ కప్ ను
దక్కించుకునేందుకు భారత్ కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న మాట వినిపిస్తోంది. రోహిత్ శర్మ ,, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ,, జస్వంత్ భూమ్రా .. పాతుకుపోయి జట్టుని నడిపిస్తున్నారు. సీనియర్లు మంచి సమన్వయంతో పని చేస్తుండడంతో ఈసారి టీం కి క్రేజ్ బాగా పెరిగింది. వాస్తవానికి 2007లో టి20 ప్రపంచ కప్ గెలుచుకున్నాక భారత్ మంచి ఊపు సంపాదించుకుంది. కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రపంచకప్ ని ఇంటికి తెచ్చుకోలేకపోయింది.
2014 లో ఫైనల్స్ లోకి వచ్చినప్పటికీ శ్రీలంక చేతిలో ఓటమి చవి చూసింది. ఇక 2016,, 22లలో సెమీఫైనల్ దాకా మాత్రమే రాగలిగింది. మిగిలిన సంవత్సరాలలో మాత్రం పూర్తిగా గ్రూప్ స్థాయిలోనే ఇటు నుంచి ఇటే.. ఇంటికి వచ్చేయడం జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం ఎటువంటి పొరపాట్లకి తావు ఇవ్వకుండా భారత్ జట్టు గట్టిగా పోరాడుతోంది.
ఈసారి భారత్ కి… టీం అమరిక బాగా కుదిరింది అని చెప్తున్నారు. బ్యాటింగ్ లైన్లో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. అందుచేత దూకుడుగా బాల్స్ ను ఉతికేస్తారు అని భావిస్తున్నారు. అలాగే బౌలింగ్ విషయం లో బూమ్రా కి తోడు గా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా బాగా ఆదుకుంటున్నారు. ఈ ప్రణాళికకు తగినట్లుగా రిషిబ్ పంత్ ..గట్టిగా కీపింగ్ చేసి సపోర్ట్ చేస్తారు.
ఈ సమీకరణాల ఆధారంగా భారత్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు.