ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలయింది అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు అప్పట్లో కడిగి విద్యార్థి సంఘం పదవులు కొనసాగుతున్నాయి. తాజా విద్యార్థి సంఘం ఎన్నికలను సగానికి పైగా పదవులను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గెలుచుకుంది. తద్వారా కామ్రేడ్ల కంచుకోట ను బద్దలు కొట్టినట్లు అయింది.
ఒకే విద్యార్థి సంఘం ఇంత భారీ స్థాయిలో పదవులు గెలుచుకోవడం మీద సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. మొత్తం మీద
42 కౌన్సిలర్ పోస్టులకు జరిగిన ఎన్నికలలో ఎబివిపి 24 పోస్టులను గెల్చుకొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ విద్యార్థి సంఘం కూడా యూనివర్సిటీలో మెజారిటీ కౌన్సిలర్ పోస్టులను గెలుచుకోలేదు. ప్రధాన పోస్టులలో సహితం చివరి రౌండ్ వరకు ఓట్ల లెక్కింపులో ఎబివిపి అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం.
ఎన్నికల్లో వామపక్ష కూటమిలో చీలిక కనిపించింది, ఏఐఎస్ఏ, డిఎస్ఎఫ్ ఒకే కూటమిగా పోటీ చేయగా, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, బిఎపీఎస్ఎ, పీఎస్ఎలతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి.ఎబివిపి ఈ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసింది.
కాగా, ఎబివిపి తన విజయాన్ని “జె ఎన్ యు రాజకీయ దృశ్యంలో ఒక చారిత్రాత్మక మార్పు” అని అభివర్ణించింది. ఇది వామపక్షాల “ఎర్ర కోట” అని పిలిచే దానిని విచ్ఛిన్నం చేసిందని పేర్కొంది.
అయితే కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులను వామపక్ష విద్యార్థి సంఘాలు గెలుచుకున్నాయి. కీలక నిర్ణయాలలో ఇంకా కొంతకాలం పాటు లెఫ్ట్ భావజాలం కొనసాగే అవకాశం ఉంది.