ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఖమేనీ ఇనుప పిడికిలి కింద నలిగిపోయిన ఇరాన్ ప్రజలు… ఆయన మరణంతో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ హయాంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు, మహిళలపై అణచివేత, మరియు కఠినమైన ఇస్లామిక్ చట్టాల పేరుతో జరిగిన హింసను గుర్తు చేసుకుంటూ అక్కడి స్థానికులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు.
…………..
ఇరాన్‌లోని బాధితులే సంతోషం వ్యక్తం చేస్తుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు మరియు కొన్ని మతపరమైన సంఘాలు ఖమేనీకి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిని “విప్లవకారుడు”గా అభివర్ణిస్తూ ఇక్కడ నివాళులు అర్పించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
……………
స్థానిక ప్రజల ఆగ్రహం వెనుక ప్రధానంగా ఒక కారణం ఉంది. మన దేశంలోని కాశ్మీర్ లో ఉగ్రవాదులు సామాన్య భారతీయులను, జవాన్లను పొట్టనబెట్టుకున్నప్పుడు ఈ కమ్యూనిస్టులు కానీ, సదరు మతపరమైన సంఘాలు కానీ ఎన్నడూ నోరు మెదపలేదు. భారతీయ పౌరుల ప్రాణాలు పోతున్నప్పుడు లేని సానుభూతి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వివాదాస్పద విదేశీ నాయకుడి మీద చూపించడమే విచిత్రం.
……………….
భారత గడ్డపై ఉంటూ, ఇక్కడి వనరులను అనుభవిస్తూ, తోటి భారతీయులు ఉగ్రవాదానికి బలైతే కనీసం సంఘీభావం తెలపని వారు.. ఇప్పుడు ఇరాన్ నాయకుడి కోసం రోడ్లపైకి రావడం ఏ పద్ధతి అని ప్రజలు అంటున్నారు. దీనిని బట్టే కమ్యూనిస్టులు, సూడో సెక్యులరిస్టుల వైఖరి బయట పడుతోందని అంటున్నారు.



