ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. గుంటూరులోని భారత్‌పేట ఆరో లైన్‌లోని 140వ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం కాసేపు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ కార్యక్రమం తర్వాత వార్డు/గ్రామ సచివాలయాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 45ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీకా వేయనున్నారు.
రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ వేయిస్తామని జగన్ ఈ సందర్భంగా అన్నారు.. ప్రతి మండలంలోని గ్రామ సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని… 104, 108 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇచ్చిన వివరాల మేరకు వ్యాక్సినేషన్ జరుగుతుందని… ఎవరైనా ముందుకు రాకుంటే…ఇళ్లకు వెళ్లి వాక్సిన్ ఉపయోగాల గురించి వాలంటీర్లు వివరించి ఒప్పిస్తారని జగన్ అన్నారరు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుందన్నారు ఏపీ సీఎం.