ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు జైలు అధికారులు కోవిడ్ పరీక్షలు చేశారు. అతనికి నెగెటివ్ వచ్చింది. క్వారంటైన్ గడువు ముగియడంతో పాటు…కరోనా లేదని తేలడంతో అతన్ని క్వారంటైన్ వార్డ్ నుంచి సాధారణ సెల్ కు మార్చారు. అటు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై గురువారం ఉదయం కోర్టు నిర్ణయం వెలువరించనుంది. దీంతో షారుఖ్ మేనేజర్ పూజా దడ్లానీ, బాడీగార్డ్ రవి ముంబై సెషన్స్ కోర్టుకు వచ్చారు. ఎన్సీబీ న్యాయవాదులనూ కోర్టు వివరాలు అడిగిన నేపథ్యంలో వారు సిద్ధమయ్యారు.