భారత్ లో సోమవారం కోవిడ్ మళ్ళీ విజృంభించడం మొదలుపెట్టింది. గత 24 గంటల్లో దేశంలో 8,000కి పైగా తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేస్ లోడ్ 4.32 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో 8,000 కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడో రోజు. అదే సమయంలో దేశంలో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి, దాంతో మరణాల సంఖ్య 5.24 లక్షలకు చేరుకుంది.
సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 8,084 కొత్త COVID-19 కేసులను నమోదయ్యాయి, దీనితో దేశంలోని కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరుకుంది. అదే సమయంలో 10 మరణాలతో మరణాల సంఖ్య 5,24,771కి పెరిగింది. 10 కొత్త మరణాలలో కేరళ, ఢిల్లీ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ఇద్దరు సహా మిజోరం, పంజాబ్ నుంచి ఒక్కొక్కరుగా ఉన్నారు.