18 ఏళ్లలోపు పిల్లలకూ కొద్దివారాల్లో కరోనా వాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ పిల్లలకోసం రూపొందించిన కోవాగ్జిన్ రెండుమూడో దశ ప్రయోగాలు పూర్తిచేసుకుంది. ప్రయోగఫలితాన్ని భారత ఔషధ నియంత్రితసంస్ధ బీసీజీఐకి అందచేయనుంది. ముక్కుద్వారా తీసుకునే వాక్సిన్ రెండోదశ ప్రయోగం కూడా కొన్నివారాల్లో పూర్తవుతుందని సంస్థ తెలిపింది.