కమ్యూనిస్ట్ ల గోల్ మాల్.. 466 కోట్లు హాం ఫట్
నీతులు చెప్పటంలో కమ్యూనిస్టులు ముందు వరుసలో ఉంటారు. కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ ఆదర్శ పాలన చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో మేధావులు ప్రచారం చేస్తుంటారు. కానీ, అదే విజయన్ చేసిన అవినీతి స్కామ్ పెద్ద కలకలం రేపుతోంది. మసాలా బాండ్స్ పేరుతో అక్షరాలా 466 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తాజాగా కేసు నమోదు చేసింది.
………………………………………………………..
కేరళ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అంటూ నిధుల సేకరణ మొదలు పెట్టారు. దీని కోసం కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డ్ పేరుతో ఒక వ్వవస్థ ను ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ద్వారా రూ. 50,000 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం. ఇందులో మసాలా బాండ్స్ ద్వారా రూ. 2,150 కోట్లు సేకరించారు. కానీ ఇందులో సుమారు 466 కోట్ల రూపాయలు కొట్టేశారని లెక్క తేలింది.
……………………………………………………………………………
ఇందులో కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ దే కీలక పాత్ర అని భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే ఈడీ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్కు రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. మరోవైపు, కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వీణ నిర్వహిస్తున్న ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందని తెలుస్తోంది. తండ్రి విజయన్ బాటలోనే వీణ కూడా అవినీతి సంపాదన రుచి మరిగిందని చాలా మంది చెబుతుంటారు. దీనిని బట్టి కమ్యూనిస్టులు నీతులు చెబుతుంటారు, తప్పితే ఏమాత్రం పాటించరు అన్న మాట అర్తం అవుతోంది.



