ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 8,94,536 కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ మృతిచెందిన వారిసంఖ్య 7193కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 నమూనాలను పరీక్షించినట్టు ప్రభుత్వం బులెటిన్ పేర్కొంది.