కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. గురువారం నాడు తొలిసారి రెండు లక్షలు దాటగా.. గడిచిన 24 గంటల్లో మరోసారి రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ మహమ్మారి బారినపడి 1,185 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,74,308కు చేరింది. ఇక ఈ మహమ్మారి నుంచి కోలుకుని 1,18,302 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 11.72 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
https://twitter.com/ANI/status/1382913374250438659