దేశ వ్యాప్తంగా కరోనా సెంకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు.. కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా యూపీ సీఎంవోలోకి కూడా ఈ మహమ్మారి ఎంటర్ అయ్యింది. పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. దీంతో సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన ఆఫీసులో కొందరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే వారిలోని కొందరితో తాను సన్నిహితంగా మెలిగారన్నారు. దీంతో డాక్ట్రర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తన తన పనిని వర్చువల్ విధానంలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
https://twitter.com/ANINewsUP/status/1381966067333951490
https://twitter.com/ANI/status/1382235575676137473