కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.
అటు గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. మరో 216 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,99,042 మంది డిశ్చార్జి అయ్యారు.
https://twitter.com/revanth_anumula/status/1374281548795502598